నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 9
వ్యవసాయ రైతుల మోటార్ల దొంగతనం చేసిన వ్యక్తులను నేరేడుచర్ల పోలీసులు అరెస్టు చేశారు
:PRESS NOTE:
“ తేది 09.03.2023 రోజు నా ఉదయం 09-30 గంటల సమయములో నేరేడుచర్ల నందు వ్యవసాయ విధ్యుత్ మోటార్ దొంగలను పట్టుబడి చేసి రిమాండ్ కు పంపే విషయం గురించి. ”
ముద్దాయిలు:
A-1. గోలి సైదులు తండ్రి చంద్రయ్య, వయసు: 45 సం.లు, కులం: రజక, వృత్తి: ఎలక్ట్రీషియన్ నివాసం పాత నేరేడుచెర్ల, నేరేడుచెర్ల టౌన్
A-2. పోరెడ్డి నాగేందర్ రెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి, వయసు: 37 సం.లు, కులం: రెడ్డి, వృత్తి: ట్రాక్టర్ డ్రైవరు నివాసం పాత నేరేడుచెర్ల, నేరేడుచెర్ల టౌన్.
A-3. షేక్ మదార్ సాబ్ తండ్రి గాలిబ్, వయసు: 29 సం.లు, కులం: ముస్లిం, వృత్తి: వాటర్ సెర్వీసింగ్ వర్క్ నివాసం నేరేడుచెర్ల టౌన్
కేసు వివరాలు:
పైన పేర్కొనబడిన నేరస్థులు నేరేడుచెర్ల, జానల దిన్నె మరియు మిర్యాలగూడెం మండలం యాదగిరి పల్లి గ్రామ శివార్లలో రైతులు వ్యవసాయా అవసరం నిమిత్తం కాలువలు, బావులు, చెరువులలో పెట్టుకున్న విధ్యుత్ మోటార్ లను సదరు నేరస్తులు తమ జల్సాలకి డబ్బుల గురించి రాత్రి వేళల్లో మొత్తం 5 మోటార్ లను దొంగతనం చేసినారు.
ఇట్టి నేరస్తులు దొంగతనం చేసిన 5 వ్యవసాయ విధ్యుత్ మోటార్ లలో రెండింటినీ నేరేడుచెర్ల నందు పాత ఇనుము కొట్టు నందు అమ్మటానికి ప్రయత్నిస్తుండగా నేరేడుచెర్ల SI, M. నవీన్ కుమార్ గారు పట్టుబడి చేయటం జరిగింది.
స్వాదినం చేసుకొన్న సొత్తు:
దొంగిలించబడిన 5 వ్యవసాయ విధ్యుత్ మోటార్ లు, దొంగతనం చేయటానికి ఉపయోగించిన TS 05EJ 4423 నెంబర్ గల గ్లామర్ మోటార్ సైకల్, దొంగతనం చేసే సమయములో ఉపయోగించిన కటింగ్ ప్లేయర్ మరియు యాక్స బ్లేడ్ స్వాదినం చేసుకోవటం జరిగినది
దొంగల ఫోటోలకు డిపార్ట్మెంట్ సహకారం లేకపోవడంతో ప్రచురించలేకపోయాం