సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 23
పండించిన పంటలకు మద్దతు ధర కావాలని ఢిల్లీ ముట్టడికి వస్తున్న రైతులపై కాల్పులు జరపగా ముగ్గురు యువ రైతులు మృతి చెందగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఈ కాల్పులకు నిరసనగా శుక్రవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంధా) ఆధ్వర్యంలో నేరేడుచర్లలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మోడీ ఆదేశాల మేరకు హర్యానా ప్రభుత్వం కాల్పులు జరిపిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంధా) విమర్శించింది. హుజూర్నగర్ నియోజకవర్గ కార్యదర్శి వాసపల్లయ్య మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల క్రితం నల్ల చట్టం రద్దు చేస్తానని హామీ ఇచ్చిన మోడీ ఈరోజు వరకు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం చేశారని అన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తే కాల్పులు జరపటం అమానుషమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సత్యమ్మ, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సయ్యద్ హుస్సేన్, నియోజకవర్గ కోశాధికారి వాస కరుణాకర్ నాయకులు ఎర్రమల శీను, కారింగుల సత్యం, రంగయ్య, లక్ష్మయ్య, మాలాంబి, పావని,లక్ష్మి దేవయ్య,లక్ష్మయ్య, దుర్గమ్మ షాజిదా జానకమ్మ, అలివేలు, నాగమణి తదితరులు పాల్గొన్నారు.