హైదరాబాద్ కేకే మీడియా జనవరి 3
రవి సీజన్ ప్రారంభమై నాట్లు ముగిసే దశకు వస్తున్న రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఇప్పటివరకు అందకపోవడంతో తెలంగాణ రాష్ట్ర రైతు లు వస్తుందా రాదా అని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ నాయకత్వంలోని తెరాస పార్టీ రైతులకు రైతుబంధు సహాయంగా పెట్టుబడి కోసం ప్రతి ఎకరాకు 5000 రూపాయలు రెండు పంటలకు కలిపి పది వేల రూపాయలు అందిస్తున్న విషయం విధితమే. ప్రారంభించిన నాటినుండి దిగిపోయే వరకు ప్రభుత్వంలో ఎన్ని కష్టనష్టాలు ఉన్నా సరైన సమయంలో రైతు పెట్టుబడి సహాయం అందించి రైతుల నుండి కేసీఆర్ ప్రభుత్వం మన్ననలు పొందుతూ వచ్చింది.
పది సంవత్సరాల సుదీర్ఘ పాలన , ఆయా నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నేరసి నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు ఎకరాకు పెట్టుబడి సహాయంగా 7 500 ఒక పంటకు పెట్టుబడి సహాయంగా అందిస్తామని రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో పెట్టుబడి సహాయాన్ని పెంచి రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ హామీని నమ్మిన రైతులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బాసటగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారు.
రెండు లక్షల రుణమాఫీ కొంత సమయం తీసుకుంటుందేమో గాని ప్రస్తుత రబీ సీజన్ లో అందించాల్సిన పెట్టుబడి సాయం పాత పద్ధతిలో గాని లేక కొత్త పద్ధతిలో గాని వస్తాయని ఆశించిన రైతులకు రభి పంట మొదలై నాట్లు ముగుస్తున్నప్పటికీ ఇప్పటివరకు పెట్టుబడి సహాయం అందకపోవడంతో రైతుల్లో ఆవేదన ఆందోళన అయోమయంలో పడిపోయారు.
బడా రైతులకు పెట్టుబడి ఎప్పుడు వచ్చినా పర్వాలేదు కానీ చిన్న సన్న కారు రైతులు మాత్రం ఖరీఫ్లో పంటలు లేక రభ్లో లో ప్రస్తుతం ఉన్న ఆర్థిక మాంద్యంలో పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్న రైతులకు మాత్రం ఎంతో ఉపయోగపడే పెట్టుబడి సహాయం అందకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు
ప్రభుత్వం రైతుల ఆవేదనను అర్థం చేసుకొని రవి పెట్టుబడి సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని ఇప్పటివరకు కేవలం ఒక్క ఎకరం రైతులకు మాత్రమే సహకారం అందించి మిగతా రైతులకు అందించకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు గమనించి వెంటనే రైతుబంధు సహాయాన్ని అందించాలని తెలంగాణ రైతులు కోరుతున్నారు.
రైతుబంధు సాయం కోసం రైతన్న ఎదురుచూపులు
RELATED ARTICLES