నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 8:
ఫుడ్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకంగా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి పేదవాడి ఆకలి తీర్చే కంటే పక్కదారి పట్టే విషయంలో కేంద్రం సీరియస్ గా ఉందని నల్లగొండ ఎంపీ నలమాధ ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నేరేడుచర్లలో నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొనతం పెద్ద వెంకట రెడ్డి సోమవారం నాడు మృతిచెందగా నేడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు కొనియాడారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని దాచిపెదుతుండగా ఎమ్మెల్యేల కనుసన్నల్లో అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి రేషన్ బియ్యాన్ని బీరు ఫ్యాక్టరీలకు కోళ్ల దానాకు రీసైక్లింగ్ కు తరలిస్తున్నారని ఆరోపించారు దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని అన్నారు. డోర్నకల్లు ముదిగొండ కోదాడ హుజూర్నగర్ మఠంపల్లి మేళ్లచెరువు నేరేడుచర్ల మిర్యాలగూడ ప్యాసింజర్ రైలు కోసం ప్రతిపాదనలు పంపినట్టు ఈ ప్రతిపాదనలు అమలు అయితే గతంలో రైల్వే లైన్కు దీనిని అనుసంధానం చేస్తే ఈ ప్రాంతం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ విషయమై రైల్వే శాఖ మంత్రి కి విన్నవించారని పార్లమెంట్లో ప్రస్తావన చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచార యాత్రను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మండల పార్టీ అధ్యక్షుడు కొనతం చిన్న వెంకటరెడ్డి. కాంగ్రెస్ నాయకులు మంజు నాయక్, ఎంపీపీ గోపాల్ సర్పంచ్ మోతిలాల్,
నిజాముద్దీన్, కౌన్సిలర్లు ప్రకాష్, నాగయ్య, కట్ట రామారావు పారేపల్లి సత్యనారాయణ వీరమాచనేని కృష్ణయ్య రాచకొండ అజయ్ మచ్చ శీను తాళ్ల రామకృష్ణారెడ్డి రమేష్ సుందరి నాగేశ్వరరావు సప్పిడి నాగిరెడ్డి రామకృష్ణ ప్రజల కోటేశ్వరరావు సైదా నాయక్ పాండు నాయక్