హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 7
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారానికి తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగం ఎల్బీ స్టేడియం.లో ఏర్పాట్ల సర్వం సిద్ధం చేసింది
సభలో మూడు వేదికలు – ప్రజా వేదికపై రేవంత్ ప్రమాణస్వీకారం
ఎడమవైపు 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక ఏర్పాటు.
కుడివైపు వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదిక
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు
గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్, కళాకారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అమరులైన అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ
తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ
ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు
స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు
ఉదయం నుంచే రాష్ట్ర నలుమూలల నుంచి హైదరాబాద్ కు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు,అభిమానులు…
ఏటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.