రూ.1500 కోసం పాపను కిడ్నాప్ చేసిన మహిళ
హైదరాబాద్ కేకే మీడియా ఆగస్ట్ 28
రూ.1500 కోసం హైదరాబాద్‌లో ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేసింది ఒక మహిళ
హైదరాబాద్ లోని కాచిగూడలో ఫుట్ పాత్ పై తన అమ్మమ్మ వద్ద నిద్రిస్తున్న ఏడాదిన్నర పాప సోమవారం రాత్రి అపహరణకు గురైంది. పోలీసులు దాదాపు 60 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి డబీర్ పురా రైల్వేస్టేషన్ వద్ద పాపను గుర్తించారు. కిడ్నాప్ కు పాల్పడిన 29 ఏళ్ల మంజులను అరెస్టు చేశారు. పాప తల్లి మమత తన వద్ద రూ.1500 అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో, చిన్నారిని కిడ్నాప్ చేసినట్లు మంజుల పోలీసులకు తెలిపింది.