హుజూర్నగర్ కేకే మీడియా జూన్ 9
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరా సెంటర్ సమీపం లో గల రాజ్య లక్ష్మీ రెస్టారెంట్ వెనుక భాగం లో ఉన్న ఖాళీ స్థలం మున్సిపాలిటీ రోడ్డు ఉండగా దానిని ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్నారని దాని పై విచారణ జరిపి రోడ్డును పునరుద్ధరించి ప్రజలకు సౌకర్యవంతం చేయాలని టి.డి.పి రాష్ట్ర నాయకు సోమ గాని నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. సోషల్ మీడియాలో కల్వకొలను రామనాథం ప్రసాద్ అనే వ్యక్తి మున్సిపాలిటీ రోడ్డు ను తన సొంత స్థలంగా తన వ్యాపార సముదాయానికి పార్కింగ్ గా వాడుతున్నారని వస్తున్న ఆరోపణ నేపథ్యంలో పూర్తి విచారణ జరిపి మున్సిపల్ ఆస్తులను కాపాడాలని కోరారు. అనంతరం కొత్తగా వచ్చిన హుజూర్నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ను సత్కరించారు