నిజమైన శ్రీమంతుడు రతన్ టాటా ఇకలేరు
స్వచ్ఛమైన భారతీయ వ్యాపారవేత్తగా లక్షల కోట్ల వ్యాపారాన్ని విస్తరించి సంపాదించడమే ధ్యేయం కాకుండా నలుగురికి పంచటము లో ఆనందాన్ని ఆస్వాదిస్తూ నిజమైన శ్రీమంతుడుగా చెరగని ముద్ర వేసిన రతన్ టాటా ఇక లేరు అన్న నిజాన్ని కోట్లాదిమంది అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి.
దోచుకుని దాచుకోనే వ్యాపార దిగ్గజాలు ఉన్న మన భారతదేశంలో గంజాయి వనంలో తులసి మొక్క లా తన జీవిత చరమాంకం వరకు తపించిన నిజమైన భారతరత్న.
నిజమైన శ్రీమంతునికి ఇవే అశ్రునివాళి
దేశం కోసం దేశ ప్రజల కోసం పరితపించే రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి.