నేరేడుచర్ల కేకే మీడియా జూన్ 21:
నిత్య యోగాతో ఆనందమయ జీవితం పొందవచ్చునని నేరేడుచర్ల మార్కెట్ చైర్మన్ నాగళ్ళ శ్రీధర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి శంకరయ్య అన్నారు. బుధవారం నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేరేడుచర్ల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగ అవగాహన కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ప్రధాన కూడలి వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ యోగ అంటేనే ఐక్యత అని ఐక్యతతో మనలో ఉన్న అహాన్ని తగ్గించి ఎదుటి వ్యక్తిని ప్రేమించినప్పుడు మన జీవితంలో ఒత్తిడి అనేది దరికి రాదని అన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యం మహాభాగ్యం కానుందని. మంచి ఆరోగ్యంతో మంచి జీవనం మంచి జీవనంతో మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. వేణు గురూజీ ఆధ్వర్యంలో యోగ ఆసనాలు నిర్వహించారు.
కార్యక్రమంలో లయన్స్ క్లబ్, వాసవి వనిత క్లబ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు