విజయవాడ కేకే మీడియా ఫిబ్రవరి 25:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 27న యూవగళం పేరుతో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టిన నాటినుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ సర్కార్ అనేక అవతారాలు సృష్టిస్తున్నప్పటికీ అడుగడుగునా నీరాజనాల నడుమ పాదయాత్రతో దూసుకుపోతున్న రు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా యువతను ఆకట్టుకునేలా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందన్న సందేశాల్ని అందిస్తూ అందరిలో ఒకడిగా అధికార పార్టీ నాయకులు ఎన్ని విమర్శలు చేసిన అధికార యంత్రాంగంతో ఎన్ని ఆంక్షలు పెట్టిన ఏమాత్రం తొనకకుండా వెనకకుండా తన మెరుగైన పదునైన మాటలాస్త్రాలతో ఎంతో ఓపికను పునికి పుచ్చుకొని దీటైన సమాధానాలు వాగ్దాటైన ప్రశ్నలు సంధిస్తూ ప్రతి ఒక్కరూ కలిసి వచ్చేలా ఉపన్యాసిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కొత్త జోష్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇటు చంద్రబాబు పర్యటనలతో కిక్కిరిసిపోతున్న అభిమానుల తాకిడికి మొన్న మహాసేన రాజేష్ శరిక నిన్నటి కన్నా లక్ష్మీనారాయణ చేరికలతో మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందన్న ఆశతో తెలుగు తమ్ముళ్లు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారు