నేరేడుచర్ల కేకే మీడియా మార్చ్ 11,:
మోదీ ష ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా బిజెపి పార్టీ తయారైందని వారి కనుసన్నల్లోనే కార్పొరేట్లు అతి సంపన్నులుగా మారుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం నాడు పెంచికల్ తిన్న గ్రామంలోని అరిబండి ఓంకార్ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ సొంత ప్రైవేటు కుటుంబం కంపెనీలు గా తయారయ్యాయని కేంద్రంలో పరిపాలనలో ఉన్న బిజెపి మోదీ షా ల ప్రైవేటు పార్టీగా ప్రజల సొమ్మును బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారని అందరి సొమ్మును కొందరికే దోచిపెట్టి కుబేరులను చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రవేశపెట్టిన దివాలా కోరు విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి పార్టీని కేంద్రంలో , రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఐకమత్య భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఓట్ల రాజకీయాలు బిజెపి చేస్తుందని ఆరోపించారు. ఈ విధానాన్ని తిప్పి కొట్టి బిజెపి గద్ద దిగేంతవరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. ప్రపంచ దేశాలన్నీ కమ్యూనిస్టు విధానాలపై దృష్టి పెట్టాయని రానున్న రోజుల్లో కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకుపోయే బాధ్యత ప్రతి వ్యక్తి ప్రతి యువకుడిది అన్నారు.
కార్యక్రమంలో జిల్లా సిపిఎం నాయకుడు కొదమగుండ్ల నాగేష్ మండల పార్టీ అధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్ మండల నాయకులు మర్రి నాగేశ్వరరావు మధు అప్పారావు మాజీ సర్పంచ్ సుంకర క్రాంతికుమార్ పెంచికల్ తిన్న గ్రామ సిపిఎం కార్యదర్శి అల్వాల శ్రీధర్ రవి బాబురావు తదితరులు పాల్గొన్నారు