నేరేడుచర్ల కేకే మీడియా
మోడీ ప్రభుత్వం తెచ్చిన న్యాయవ్యవస్థలోని మూడు కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని లేదా వాటిలో మార్పులు చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గం కన్వీనర్ వాస పల్లయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నేరేడుచర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఇంగ్లీష్ చట్టాల పేరుతో భారతదేశంలోని న్యాయవ్యవస్థలో ఉన్న ఐపీసీ, సిఆర్పిసి చట్టాలను తొలగించి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికత సురక్ష సంహిత, భారతీయ సాక్ష అదినియమ్ అనే మూడు కొత్త చట్టాలను తెచ్చి న్యాయవ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. పోలీసులకు అధికారం ఉండే విధంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి దొడ్డిదారిలో కొత్త చట్టాలు తెచ్చారని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే వారిని తెలిసి తెలియక తప్పులు చేసే వారిని కఠినంగా పోలీసులు శిక్షించే విధంగా చట్టాలను రూపొందించారనిఅన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్న ఈ చట్టాలను వ్యతిరేకించాలన్నారు. సమావేశంలో నాయకులు ఎర్రమల శీను, పి ఓ డబ్ల్యు నియోజకవర్గ అధ్యక్షురాలు లక్ష్మి, శ్యామల, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ ,పీవైఎల్ జిల్లా నాయకుడు వాస కరుణాకర్, అంబటి బిక్షం, కోటయ్య, దేవయ్య, ఆనంద్, ఎర్రమల నర్సమ్మ ,లక్ష్మమ్మ, దుర్గమ్మ, రంగయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.