Wednesday, December 11, 2024
HomeTelanganaమై హోం వద్ద ఉద్రిక్తత

మై హోం వద్ద ఉద్రిక్తత

మేళ్లచెరువు కేకే మీడియా జూలై 26

మృతదేహాలను చూపించాలంటూ కార్మికులు ఆందోళన

అర్ధరాత్రి సెక్యూరిటీ గేటు వద్ద ఫర్నిచర్ ధ్వంసం, సెక్యూరిటీ పై దాడి.

భారీగా మోహరించిన పోలీసులు.

పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం, తోపులాట

క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన

పనులు నిలిపివేత, కిలోమీటర్ దూరంలోని కార్మికులను ఆపిన పోలీసులు

రెండో రోజు ప్రమాద శకలాలను తొలగింపుపై అస్పష్టత.

*మేళ్లచెరువు:-* సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పరిధిలోని మైహోం సిమెంట్స్ లో ప్రమాద ఘటన వద్ద బీహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ కు చెందిన బాధ్యత కార్మికులు ఆందోళన దిగారు. చనిపోయిన వారి మృతదేహాలు చూపించాలంటూ మంగళవారం అర్ధరాత్రి నిర్మాణ ప్రదేశం పై దాడులకు దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కార్మికుల ఆందోళన పై పరిశ్రమ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నిర్మాణ పనులు నిలిపివేసి ప్రమాద ఘటన శకలాలను కార్మికులకు లేకుండానే తొలగించారు. గోప్యంగా ప్రమాద శాఖలను తొలగించడం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. షకలాల కింద 5మంది కార్మికులు ఉన్నట్లు తోటి కార్మికులు ఆరోపించారు. వారి వివరాల కోసమే కార్మికుల ఆందోళన చేసినట్లు తెలుస్తుంది.

*భారిగా పోలీసుల మోహరింపు*

మంగళవారం రాత్రి నుండి భారీ సంఖ్యలో సూర్యాపేట జిల్లా పోలీసులు, స్పెషల్ బెటాలియన్ పోలీసులు ప్రమాద ఘటన వద్ద బందోబస్తు నిర్వహించారు.ఘటన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోని కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్మికుల మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది మృతదేహాలను చూపియాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు పోలీసులపై రాళ్లూరువారు. కటలా స్థలానికి డిఎస్పి ప్రకాష్ యాదవ్ చేరుకొని మృతదేహాన్ని ఆయా రాష్ట్రాలకు తరలించినట్లు వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. కార్మికుల నివాసం ఉండే ప్రదేశంలో డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు.

*మైహోమ్ నిర్మాణాలకు అనుమతులు నిల్*

ప్రమాదం జరిగిన నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం వలన ప్రమాదం చోటు చేసుకున్నట్లు పలువురు నేతలు ఆరోపించారు. మైహోమ్ సిమెంట్ పరిశ్రమ ఒకచోట అనుమతులు తీసుకొని, నిర్మాణాలు మాత్రం వివాదాస్పద భూదాన్, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలోని అనుమతులు లేవని ప్రభుత్వం గతంలోనే నిలుపుదల చేసినట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన మైహోమ్ సిమెంట్ పై వెంటనే కేసులు నమోదు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ నాయకులు మేళ్లచెరువు తాసిల్దార్ దామోదర్ రావు కు ఫిర్యాదు చేశారు. బిజెపి నాయకులు పోలీస్స్టేషన్లో మైహోమ్ కంపెనీ పై ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ నాయకులు బాధిత కార్మికులను పరామర్శించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments