మేళ్లచెరువు కే కే మీడియా:
మేళ్లచెరువు శంభు లింగేశ్వర సాక్షిగా
‘మహా…మాయ ‘ మహా మాయ..!
హుజూర్నగర్ కేకే మీడియా::
*పన్ను రూ.2.80కోట్లు
*చెల్లించింది రూ.25లక్షలు
*ఏడు ఏళ్లుగా రివిజన్ కు అడ్డగింత*
*పదేళ్లుగా భారీగా పన్ను ఎగవేత*
అధికారులకు పెద్ద ఎత్తున తాయిలాలు
*మేళ్లచెరువు కు శనీశ్వరంగా రామేశం ఇండస్ట్రీ*
*విస్తీర్ణం 400 ఎకరాలు.. పన్ను చెల్లింపు 18 ఎకరాలకే..*
*మేళ్లచెరువు:-* జిల్లాలో మారు మోగుతున్న గ్రామపంచాయతీ మేళ్లచెరువు. దగా మోసం అక్రమాలకు వేదికైంది. నిత్యం వార్తల్లో ఎక్కుతుంది.
గ్రామపంచాయతీ భవనానికి ఏకంగా తన పేరు రాయించుకున్న ఘనత ఇక్కడ సర్పంచ్ దే. ఆ సర్పంచ్ ఏకంగా రూ.2కోట్ల గ్రామపంచాయతీ సొమ్ము కాజేసాడని, రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంకాస్త లోతుగా వెళ్తే.. పన్ను వసూళ్లలో నో జిల్లా మొత్తం మీద వెనుకంజలో ఉందని ఇటీవల బయటపడింది. ఆరా తీస్తే.. పన్ను వసూల్లో పెద్దఎత్తున అక్రమాలు.. వాటిలోనూ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ అధికారుల చేతివాటం చర్చనీయాంశమైంది.
*ఏడు సంవత్సరాలుగా నో రివిజన్*
సాధారణంగా గ్రామపంచాయతీలల్లో ఇంటి విస్తీర్ణం+ఇంటి విలువ ను అంచనా వేసి మొత్తం విలువ మీద 0.15 పైసల నుండి 0.50 పైసలు రెసిడెన్షియల్ ఇండ్లకు గ్రామపంచాయతీ పన్ను వసూలు చేస్తారు. ఈ పన్ను మొత్తంపై 8శాతం లైబ్రరీ పన్ను. కమర్షియల్ బిల్డింగులకు, కంపెనీలకు కట్టడాల విస్తీర్ణం+కట్టడాల విలువ మీద పన్ను 0.25 పైసల నుండి ఒక్క రూపాయి వరకు పన్ను వసూలు చేసుకునే అధికారం గ్రామపంచాయతీకి ఉంది. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి బిల్డింగ్ కొలతలను లేదా రికార్డులను రివిజన్ చేపడుతూ గత పన్ను మీద 20శాతం మేర పెంచుకుంటూ గ్రామపంచాయతీ పన్ను వసూలు చేస్తారు. అలా మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 3 వేల ఇళ్లకు పన్నులు వసూలు చేస్తున్న గ్రామపంచాయతీ అధికారులు, ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో 400ఎకరాల్లో ఉన్న మైహోమ్ సిమెంట్స్ పరిశ్రమ వద్ద నుండి పన్నును వసూలు చేయడం లేదు. 20 ఏళ్ల క్రితం నిర్ధారించిన కొలతలు ప్రకారమే పన్ను తీసుకుంటున్నారు. ఇప్పటి వాస్తవ విస్తీర్ణం, కట్టడాల విలువ ప్రకారం వసూలు చేయడం లేదు.
*పన్ను వసూళ్లల్లో పెద్ద ఎత్తున అక్రమాలు*
2022 23 ఆర్థిక సంవత్సరంలో మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీ ఇండ్ల రికార్డులను రీవిజన్ చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు మైహోమ్ సంస్థకు చెందిన 400 ఎకరాల విస్తీర్ణంలోని కట్టడాలకు మాత్రం రివిజన్ చేపట్టలేదు. 7 సంవత్సరాల క్రితం 2016-17లో చేపట్టిన రివిజన్ ప్రకారమే తూతూ మంత్రంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఆ సమయంలో సైతం ఎటువంటి కొత్త విస్తీర్ణానికి పన్నులు విధించకుండా అందాజాగా పన్ను విధించినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పుడు కూడా పెద్ద ఎత్తున తాయిలాలు చేతులు మారినట్లు గత పాలకవర్గం విమర్శలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం రూ.25 లక్షలు పన్ను చెల్లిస్తుండగా, 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఈ పన్నులు రూ.2కోట్ల 80 లక్షలు చెల్లించాల్సిందిగా అందాజాగా అంచనా వేసి డిమాండ్ నోటీసు మైహోమ్ సంస్థకు జారీ చేశారు.ఆ పన్ను కట్టకపోగా పాత లెక్కల ప్రకారం రూ
25 లక్షలు చెల్లించారు. ఈ ఏడాది సైతం రివిజన్ చేపట్టకుండా మళ్లీ అడ్డు తగిలారు. మేళ్లచెరువు గ్రామంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రామస్తుల ఇండ్లకు రూ.30 లక్షల వరకు గ్రామస్తులు పన్ను చెల్లిస్తుండగా,400 ఎకరాల్లో ఉన్న సుమారు రూ.3000 కోట్లు పైచిలుకు విలువచేసే మైహోమ్ సంస్థ కట్టడాలకు రూ.25లక్షలు మాత్రమే పన్ను చెల్లించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
*గత మూడేళ్లుగా చక్రం తిప్పుతున్న పంచాయతీరాజ్ జిల్లా స్థాయి అధికారి*
పన్నులు చెల్లింపుల్లో మేళ్లచెరువు మేజర్ గ్రామపంచాయతీ జిల్లాలోని చివరి స్థానంలో ఉండటంతో పన్నులు వసూళ్లల్లోజరిగిన అక్రమాల బాగోతం బట్టబయలైంది. గత మూడేళ్లుగా మైహొమ్ సంస్థకు చెందిన నిర్మాణాలకు రివిజన్ చేపట్టకుండా ఓ జిల్లా స్థాయి అధికారి పెద్ద ఎత్తున తాయిలాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. జిల్లా అదనపు కలెక్టర్ మేళ్లచెరువు గ్రామపంచాయతీ పన్నులు వసూళ్లపై దృష్టి సారించారు. మైహోమ్ సంస్థకు చెందిన యాజమాన్య వారిని పూర్తిస్థాయిలో పనులు చెల్లించాలని, ఈ మేరకు కలెక్టరేట్ పిలిపించి 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కట్టడాలు వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన పంచాయతీరాజ్ శాఖ జిల్లా స్థాయి అధికారి ప్రస్తుతం కడుతున్న రూ.25లక్షలను వెంటనే డిపాజిట్ చేయించారు. చెల్లించిన రూ.25లక్షల తో పాటు మరో రు.25 లక్షలు కలిపి రూ.50 లక్షలు పన్ను చెల్లించే విధంగా ఓ సెటిల్మెంట్ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. అందాజాగా రూ.50 లక్షలు చెల్లించే విధంగా సెటిల్మెంట్ చేసుకున్న అధికారులు మైహామ్ సంస్థ జోలికి వెళ్లకుండా తాను చూసుకుంటానని ఆ అధికారి భరోసా ఇచ్చినట్లు సమాచారం. రూ.కోట్ల రూపాయల పన్ను ఎగనామం పెట్టే విధంగా సెటిల్మెంట్ చేసినందుకు తన ఖాతాలో రు.25 లక్షలు వరకు తాయిలాలు అందుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు అన్ని తాను చూసుకుంటానని వెంటనే పాత లెక్కల ప్రకారం రూ.25లక్షలు పన్ను డబ్బులను చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకొని, గురువారం నాడు మైహోమ్ యాజమాన్యం నుండి రూ.25లక్షల చెక్కును గ్రామపంచాయతీకి అందజేశారు.ఇదిలా ఉంటే రివిజన్ జరిగినప్పుడల్లా గ్రామ పంచాయతీకి అధికారులకు తాయిలాల రూపంలో రావలసిన రూ.5లక్షలు రాలేదని తెగ బాధపడిపోతున్నారని వినికిడి. పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేయకుండా వ్యవహరిస్తున్నందుకుగాను గ్రామపంచాయతీకి తాయిలాల రూపంలో ఏటా రూ.10లక్షలు వరకు సంబంధిత కంపెనీ చెల్లిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. పంచాయతీరాజ్ జిల్లా స్థాయి అధికారి గతంలో సైతం మై హోమ్ సంస్థ నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు లేవంటూ నిర్మాణాలను నిలుపుదల చేసి, అనంతరం వారి వద్ద పెద్దఎత్తున తాయిలాలు పుచ్చుకొని ఎటువంటి నిబంధనలు లేకుండానే నిర్మాణాలకు అనుమతులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో 400 ఎకరాలకు మైహోమ్ లాంటి బడా సంస్థల వద్ద పన్నులు వసూలు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పన్ను చెల్లింపుల్లో దగా చేసిన ఎత్తున మహా సిమెంట్స్ యాజమాన్యం, కంపెనీ ప్రతినిధులు, అవినీతికి పాల్పడిన పంచాయతిరాజ్ శాఖ అధికారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆధారాలతో కొందరు సీఎం రేవంత్ రెడ్డి నీ కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం.