హైదరాబాద్ కేకే మీడియా డిసెంబర్ 11
నీటిపారుదల & పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం జలసౌధ భవన్‌లో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు.ఈసందర్భంగా మట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ మ్యానిఫెస్టోలో సాగు నీటికి సంబందించిన అంశాలను అనుసరిస్తుందని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కృంగి పోవడం పై తక్షణ విచారణ జరపాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తాం. అన్నారు మంత్రి ఉత్తం. తెలంగాణకు కృష్ణా జలాల హక్కు వాటా కోసం పోరాడుతామని పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం.అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు తొందరగా నీరు ఇవ్వగలిగే పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తాం మరియు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన పూర్తిచేస్తాం.అని బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును చేపడతామని. 40,000 చెరువుల పరిధిలో ఆయకట్టును మెరుగుపరచడానికి అవసరమైన చర్యలు తీసుకొంటాం.అని మంత్రి ఉత్తమ్ అన్నారు