పాలకీడు కేకే మీడియా మార్చి 15:
రాజకీయాల్లో మేటి నాయకుడు అరిబండి లక్ష్మీనారాయణ అని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు. బుధవారం పాలకీడు మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యుడు అరిబండి లక్ష్మీనారాయణ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆయన మనవడు పెంచికలదిన్నె గ్రామ మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అందజేసిన సందర్భంగా మాట్లాడుతూ ఆదర్శవంతమైన రాజకీయాలు చేసి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ముఖ్యంగా కరెంటు రోడ్లు బ్రిడ్జిలు కాలనీ ఇండ్లు ఏర్పాటుకు విశేషమైన కృషి చేశారన్నారు. ప్రస్తుత రాజకీయాలకు గత రాజకీయాలకు పోలికే లేదని అలాంటి నీతివంతమైన ఆదర్శవంతమైన నాయకులు ప్రస్తుతం అరుదుగా కనిపిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం ధన మూర్తి, సింగల్ విండో డైరెక్టర్ మట్టేష్ , రామ్ రెడ్డి, నాగయ్య, రాజు ,నాయక్ తదితరులు పాల్గొన్నారు