నేరేడుచర్ల కేకే మీడియా సెప్టెంబర్ 8
హుజర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నెరేడుచెర్ల మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిధి గా హాజరయ్యారు
ఈ సందర్బంగా శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ..మూడున్నర ఏళ్లలో హుజర్నగర్ నియోజకవర్గం 40 ఏళ్ల అభివృద్ధి ని సంతరించుకుందనీ, అభివృద్ధి పై 3500 కోట్ల రూపాయల నిధులు ఖర్చుపెట్టడం జరిగినదనీ దీనికి సంక్షేమాన్ని జోడిస్తే హుజర్నగర్ నియోజకవర్గంలో 7 వేల నుండి 8 వేల కోట్ల రూపాయల నిధులతో ఈ మూడున్నర ఏళ్లలో అభివృద్ధి మరియు సంక్షేమం ప్రజలకు అందిస్తున్నామని తెలియజేసారు
రానున్న రోజులలో హుజర్నగర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ సెక్టార్ లో డవలపమెంట్ చేసి..పెద్ద ఎత్తున యువత కు ఉపాధి ఉద్యోగ మార్గాలకి తెర తిస్తామని ,దీనికోసం ఇప్పటికే వ్యూహాత్మక మరియు క్షేత్రస్థాయి పరిశోధనాత్మక విధానాలతో వివిధ పెద్ద పెద్ద ఇండస్త్రీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని తెలియజేసారు
ప్రజాసేవలో అధికారులు ..ప్రజల పట్ల ప్రజాసమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉండాలని ,ప్రజలకు అందుబాటులో ఉండాలని ..పారదర్శకంగా విధులు నిర్వహించాలని సూచించారు
ఎంపీపీ లక్ష్మళ్ల జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు,అధికారులు,పాల్గొన్నారు