నెరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 9
తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా ములుగు జిల్లాలో అనేక గ్రామాలు నీటి ఉధృతితో దెబ్బతినగా అట్టి వరద బాధితుల సహాయార్థం బుధవారం నాడు నేరేడుచర్లకు చెందిన సాయి సిరి సూపర్ మార్కెట్, సూర్యాపేట టైమ్స్ రిపోర్టర్ యారవ సురేష్ ఆధ్వర్యంలో మిత్రబృందంతో కలిసి సేకరించిన 70000 రూపాయలతో. బాధితులకు వారి యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపయోగపడే బెడ్ షీట్లు,బట్టలు, టవల్స్,లుంగీలు, దోమతెరలు,టార్చి లైట్లు, చెప్పులు, స్కూల్ పిల్లలకు షూ కొబ్బరినూనె,శాస్త్రీబామ్ డబ్బాలు బిస్కెట్ ప్యాకెట్లు వరద బాధితులకు పంపిణీ చేసేందుకు .ములుగు తరలి వెళ్లారు. అట్టి బృందంలో మానుకొండ రాంరెడ్డి, యారవ సురేష్,దేవులపల్లి శంకర చారి, జింకల భాస్కర్, కొప్పు రామకృష్ణ గౌడ్, జంపాల రాకేష్ మల్లయ్యలు ఉన్నారు.