హైదరాబాద్ కేకే వీడియో జనవరి 2
మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ మంగళవారం నాడు తెలంగాణ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
గతంలో శంకరమ్మ ఇరిగేషన్ శాఖ మంత్రి హుజూర్నగర్ ఎమ్మెల్యే ఉత్తంకుమార్ రెడ్డి ని కలవగా నేడు సీఎం రేవంత్ రెడ్డి ని కలవడంతో రాజకీయ ఊహాగానాలు నెలకొన్నాయి.
గతంలో శంకరమ్మకు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ ఇస్తారని ఆశపడిన ఇప్పటివరకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి రావడం గతంలో టిఆర్ఎస్ పార్టీ తనకు న్యాయం చేయలేదని బహాటంగా చెప్పటం తో. ఈ వరుస కలయికలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.