Monday, December 15, 2025
HomeTelanganaముఖ్యమంత్రికి స్వల్ప అస్వస్థత

ముఖ్యమంత్రికి స్వల్ప అస్వస్థత

హైదరాబాద్ కేకే మీడియా మార్చి12
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి సీఎంకు కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సీటీ స్కాన్‌, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో సీఎంకు కడుపులో చిన్న అల్సర్‌ ఉన్నట్టుగా తేలింది. మందులతో ఆ అల్సర్‌ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. అల్సర్‌ మినహా మిగతా అన్ని పారామీటర్స్‌ నార్మల్‌గా ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో, అల్సర్‌ తగ్గడానికి అవసరమైన మెడికేషన్‌ను ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments