మళ్లీ అడగను అంటేనే డబ్బులు తీసుకుంటా ?
నేటి ప్రజాస్వామిక రాజకీయాలు విలువల కంటే డబ్బుకే ప్రాధాన్యత పెరిగిపోయిన పరిస్థితులు విధితమే. ఎన్నికల కోసం ఒకరిని చూసి మరొకరు విచ్చలవిడిగా పోటీపడుతూ డబ్బులు అప్పులు చేసి మరీ ఖర్చులు పెడుతున్న పరిస్థితి.
ఇక మద్యం, మాంసం షరా మామూలే
ఈ పరిస్థితుల్లో నేపథ్యంలో కొన్ని కొన్నిచోట్ల డబ్బులు పంచి గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న కొందరు గెలవకపోవడంతో మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ ఓటర్ల దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్న పరిస్థితి.
తీసుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి మా దగ్గర లేవు అని గొడవలు జరిగిన సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో మరో మారు డబ్బుల ప్రవాహం ఏరులై పారుతుంది.
గతంలో అనుభవాల దృష్ట్యా, సోషల్ మీడియా, ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో అభ్యర్థుల అందరి దగ్గర డబ్బు తీసుకునీ ఓట్ల అమ్ముకునేవారు మాపై నమ్మకం ఉంటేనే డబ్బులు ఇవ్వండి మళ్లీ తిరిగి అడిగితే ఇచ్చేది లేదు అంటూ తెగేసి చెప్పి మరి అడుక్కుంటున్న పరిస్థితి.
అందరి దగ్గర డబ్బులు తీసుకునే ఓటర్లు ఎవరికి ఓటేస్తారో, అందరికీ న్యాయం చేయాలని సగం సగం ఓట్లేసి ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో తెలియని అయోమయ పరిస్థితి.

