Tuesday, December 10, 2024
HomeTelanganaమిర్యాలగూడ సమగ్ర అభివృద్ధి నా ఎజెండా నలమోతు భాస్కరరావు

మిర్యాలగూడ సమగ్ర అభివృద్ధి నా ఎజెండా నలమోతు భాస్కరరావు

మిర్యాలగూడ కేకే మీడియా నవంబర్ 11

మిర్యాలగూడ పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శనివారం పట్టణంలోని సుందర్ నగర్, రంగ్రీజ్ బజార్, మెయిన్ బజార్, రంగన్న కాలనీ, ముత్తిరెడ్డి కుంట, వినోభానగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ప్రగతి యాత్రతో ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి ప్రతి కాలనీలో డప్పు చప్పుళ్లతో, మంగళహరతులతో, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రచారానికి యువకులు, మహిళలు, వృద్దులు, పార్టీ అభిమానులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. ప్రచారంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ పట్టణ ప్రజానికానికీ మెరుగైన మౌలిక సదుపాయాలు, మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్డు, నల్లగొండ రోడ్డు, ఖమ్మం రోడ్డు విస్తరణ పనులు చేపట్టి సుందరంగా తీర్చిదిద్దాం. రాజీవ్ చౌక్, నల్లగొండ బైపాస్ రోడ్డులోని వై – జంక్షన్, తడకమళ్ల, ఈదులగూడ జంక్షన్ లు ఎంతో సుందరంగా తీర్చిదిద్దాం. పట్టణంలోని ప్రతి వార్డులో సిమెంటు రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాం. పట్టణ ప్రగతి కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణంలో పార్కులు, మినీ ట్యాంక్ బండ్, జిమ్ లు, వాకింగ్ ట్రాక్ లు, కేసీఆర్ కళాభారతి, ఇండోర్ స్టేడియం నిర్మించుకున్నామన్నారు. పట్టణ ప్రజారోగ్యానికి బస్తీ దవాఖానాలతో అందరి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు.

రైస్ మిల్స్ ఆఫ్ సిటీని మిర్యాలగూడను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత ఈ నల్లమోతు భాస్కర్ రావుదే…అన్నిసామాజిక వర్గాల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఇదే అభివృద్ది, సంక్షేమం కొనసాగించలంటే మరోసారి కారు గుర్తుకు ఓటేసి, భాస్కర్ రావును గెలిపించాలని పిలుపునిచ్చారు.

ప్రచార ప్రగతి యాత్రలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు తదితరు నాయకులు పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments