మిర్యాలగూడ కేకే వీడియో
. ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా కేటీఆర్ రోడ్ షో సందర్భంగా జరిగిన భారీ జన సమీకరణలో మిర్యాలగూడ పట్టణం జనసంద్రంగా మారింది. ఎన్నికల ప్రచారానికి గతంలో నామినేషన్ కి ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు నేపథ్యంలో టికెట్ సిపిఎం కు వస్తుందని ఆశించి న నేపథ్యంలో కాంగ్రెస్ ఆశావాహుడైన భక్తుల లక్ష్మారెడ్డి నామినేషన్ వేసే క్రమంలో భారీ జన సమీకరణ చేయడంతో కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తు వైఫల్యం కారణంగా భక్తుల లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నెలమూతు భాస్కరరావు మరో భారీ జన సమీకరణ చేయడం కోసం ఏర్పాటుచేసిన కేటీఆర్ రోడ్ షో తో మిర్యాలగూడ పట్టణం భారీ సనే సమీకరణతో నిండిపోయింది. రోడ్ షో కు వచ్చిన కేటీఆర్ మాట్లాడుతూ. ఎకరా రైతు 10 హెచ్పి మోటారు వాడే వారెవరైనా ఉన్నారా కనీస అవగాహన లేకుండా టిపిసిసి అధ్యక్షుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీలు అమలు చేయలేని పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 55 ఏళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇవ్వలేని వారు ఇప్పుడు ఏదో చేస్తానంటే నమ్మాలా అని ప్రశ్నించారు . ఇన్ని ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ రైతులకు రైతుబంధు ఇవ్వాలని ఆలోచన వచ్చిందా అని ప్రశ్నించారు. నాడు చేయలేని పనులు నేడు చేస్తామంటే నమ్మాలా అన్నారు. మాయమాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటేస్తే నష్టం జరగడం ఖాయమన్నారు. ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ముఖ్యమంత్రిగా చేస్తే బంగారు తెలంగాణ సాధించడం సాధ్యమన్నారు. దళిత బంధు, బీసీ బందు, గృహలక్ష్మి, రైతుబంధు పెంపు, పెన్షన్ల పెంపు చేసి చూపించిన పార్టీ టిఆర్ఎస్ అని మరొకసారి మిర్యాలగూడలో టిఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావును గెలిపిస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాలతోపాటు మిర్యాలగూడ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అమరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, అన్న భీమోజు నాగార్జున చారి, తదితరులు పాల్గొన్నారు