తీరు మారని డాక్టర్…..
ఈ డాక్టర్ మాకొద్దు అంటున్న గ్రామ ప్రజలు.
నేరేడుచర్ల కేకే మీడియా ఆగస్టు 14:
ఉన్నతాధికారుల నుంచి షోకాజ్ నోటీస్ వచ్చిన తీరు మారలేదు ఒక డాక్టర్ కి. చేసేది ప్రభుత్వ ఉద్యోగం, బాధ్యత రాహిత్యం , వృత్తిపై లేని నిబద్ధత ఇన్ని రకాలుగా సదరు డాక్టర్ పై ఆరోపణలు వస్తున్న, ఉన్నతాధికారులు మాత్రం సరియైన చర్య తీసుకోకపోవడంతో తప్పు మీద తప్పులు చేస్తూ వస్తోంది ఆ డాక్టర్…
మండలంలోని పెంచికల్ దిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సీతామహాలక్ష్మి.
పెంచికల్ దిన్నె లో ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఏదో ఒక సమస్య ఉత్పన్నం అవుతూనే వస్తుంది. గతంలో అక్కడ పనిచేసిన డాక్టర్ల కంటే భిన్నంగా రోగులను పట్టించుకోకపోవడం, ప్రజా ప్రతినిధులతో వైరం, ఉద్యోగ బాధ్యతలు సరిగా నిర్వర్తించకపోవడం, బాధ్యతారాహిత్యం, సమయపాలనలో లోపం, ఆసుపత్రికి రాకుండానే వచ్చినట్లుగా చూపించడం,
సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయడం
తో కొంతకాలం క్రితం ఇచ్చిన ఫిర్యాదులో, మీడియాలో వచ్చిన వార్తలతోనో జిల్లా అధికారులు స్పందించి డాక్టర్కు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తీరు మారకపోగా బుధవారం సమయం కంటే ముందే మధ్యాహ్నం మూడు గంటలకే రేపటి సంతకాలు చేసి మరీ వెళ్లిపోవడంతో అక్కడికి వచ్చిన గ్రామస్తులు డాక్టర్ ఏరని ప్రశ్నించగా వెళ్లిపోయారని చెప్పగా అటెండెన్స్ రిజిస్టర్లో రేపు వచ్చినట్లుగా సంతకం పెట్టి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు
ఈ డాక్టర్ మాకొద్దు::
తప్పుల మీద తప్పులు చేస్తూ పేద ప్రజలకు సేవలు చేయలేని ఈ డాక్టర్ మాకొద్దని, ఈ డాక్టర్ని తొలగించి బాధ్యత కలిగిన డాక్టర్ని పెంచికల్ దిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.