కేకే మీడియా హనుమకొండ, ఆగస్టు 29
నిషేధిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ , మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా పని చేసిన బుజగుండ్ల అనిల్ అలియాస్ క్రాంతి కిరణ్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట గురువారం లొంగిపోయాడు. లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్‌ఝా వివరాలు వెల్లడిస్తూ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ఆర్షనపల్లి గ్రామానికి చెందిన ఆనిల్ అలియాస్ క్రాంతి కిరణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలో అప్పటి పీపుల్స్‌వార్ గ్రూప్‌లో పనిచేసిన ఇరువురు మరణించడంతో అనిల్ ను తాతయ్య, నాయనమ్మ లే పెంచారని తెలిపారు. చదువుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ కి సంబంధించిన విద్యార్థి విభాగంలో పనిచేశాడని తెలిపారు. ఆనిల్ డిఎస్‌ఈయు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షుడిగా పనిచేసినట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో అనిల్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కరావు ప్రోత్సహంతో 2021 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరాడని పేర్కొన్నారు. పార్టీలో చేరిన మావోయిస్టు అనిల్ కొద్ది రోజులు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ అలియాస్ అనంద్‌ల వద్ద వ్యక్తిగత సహయకుడిగా పనిచేశాడని తెలిపారు. అనంతరం 2023 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం మడ్ ఏరియా కమిటీ సభ్యుడుగా బాధ్యతలు చేపట్టాడని, ఇదే సమయంలో అనిల్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, సెంట్రల్ రిజినల్ బ్యూరో కార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను అధ్వర్యంలో మావోయిస్టు పార్టీ ప్రచార కర్తగా కూడా 2023 నవంబర్ వరకు పనిచేసాడని పేర్కొన్నారు. చివరగా మావోయిస్టు పార్టీ
నాయకత్వం ప్రస్తుత సంవత్సరం జూలై మాసంలో ఆనిల్‌ను తెలంగాణ రాష్ట్ర కమీటీలో ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించిందని తెలిపారు. ఇదే సమయంలో గత జూలై మాసం 19వ తేదిన బీజాపూర్ జిల్లా పరిధిలోని సిమలదొడ్డి గ్రామ ఆటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్ ప్రత్యక్షంగా పాల్గోన్నాడని పేర్కొన్నారు. ఎదురు కాల్పుల్లో మవోయిస్టు దులా మరణించాడని, దీంతో గత జూలై చివరి వారంలో అనిల్ తిరిగి మరోమారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరియు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా వారి ల్యాప్‌టాప్‌ను ఉపయోగిస్తూ ఆగ్రనేతల ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన పత్రికల్లో కథనాలు, వ్యాసాలు, వీడియోలు, ఇంటర్‌నెట్ అనుబంధ కార్యకలపాలు నిర్వహించేవాడని తెలిపారు. మావోయిస్టు పార్టీలో రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన అనిల్ గత కొద్ది రోజులుగా నరాలకు సంబంధించిన వ్యాధి సమస్యతో పాటు మావోయిస్టు పార్టీకి ప్రజల నుండి ఎదురౌవుతున్న వ్యతిరేక అలాగే ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు అకర్షితుడై జనజీవన స్రవంతి లో కలిసేందుకు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. లొంగి పోయిన మావోయిస్టు సభ్యుడు అనిల్‌పై ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించిందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన రివార్డును నాలుగు లక్షల రూపాయల చెక్కును లొంగిపోయిన మవోయిస్టు కు పోలీస్ కమిషనర్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏసీపీ జితేందర్ రెడ్డి లు పాల్గొన్నారు.