హుజూర్నగర్ కే కే మీడియా ఆగస్ట్ 29:
క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని విద్యార్థులు క్రీడలలో ముందు ఉండాలని జిల్లా పరిషత్ పాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
అబ్దుల్ లతీఫ్ అన్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్చంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల లో ధ్యాన్చంద్ చిత్రపటానికి పుష్పమాలతో నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు
పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి జ్యోతిని వెలిగించి నివాళులర్పించారు .
ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు శ జయప్రద శ్రీజ , శైలజ బాల సాయి ,లక్ష్మి, మాధవి, కమలమ్మ, కరుణ, జానీ బేగం, విజయలక్ష్మి ,జీవన, గ్రేస్ మేరీ రజిత, షబానా విజయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

