✒️- మాజీ మంత్రి రోజా, ఆమె భర్తపై ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ : మాజీ మంత్రి రోజా, ఆమె భర్త సెల్వమణిపై చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలింబాకకు చెందిన గుణశేఖరరెడ్డి మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ‘మా నాన్న జ్యోతినగర్‌లో 1982లో స్థలం కొన్నారు. దాన్ని రోజా, ఆమె భర్త సెల్వమణి, నగరి పురపాలక సంఘం చైర్మన్‌లతో కలిసి మీనా కుమార్ అనే వ్యక్తి కబ్జా చేశారు. ఆర్డీవో, తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయండి.’ అని గుణశేఖరరెడ్డి వాపోయారు..🌱