హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 10
మహిళల హక్కుల కోసం నిరంతరం విన్నపం ఒక పోరాటం అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి నియోజకవర్గంలో విద్యార్థినిలు, మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై గల వ్యక్తి పోరాటం చేస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గం గోపాలపురం గ్రామానికి చెందిన స్వచ్ఛంద కార్యకర్త చికూరి లీలావతి హుజూర్నగర్ నియోజకవర్గ బరిలో శాసన సభకు జరుగుతున్న ఎన్నికల్లో తన నామినేషన్ వేశారు.
మహిళలు స్వతంత్రంగా ఆర్థికంగా ఎదిగేందుకు స్వయం ఉపాధి అవకాశాలు లభించేందుకు శిక్షణ కార్యక్రమాలతో పాటు ఉపాధి అవకాశాల కల్పన కోసం మహిళల పక్షపాతిగా నిరంతరం మహిళల కోసం పోరాడుతూ ఉండే నన్ను హుజూర్నగర్ నియోజకవర్గంలో సగభాగంగా ఉన్న మహిళా ఓటర్లు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం మహిళల అభ్యున్నతి కోసం పాటుపడతానని తెలిపారు