నేరేడుచర్ల కే కే మీడియా జూలై 30:
సూర్యాపేట జిల్లా వ్యాపితంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ మహిళా సమాఖ్య బాధ్యతాయుతగా వ్యవహరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన పిలుపునిచ్చారు
మంగళవారం నాడు నేరేడుచర్ల లోని సిపిఐ కార్యాలయం ప్రజా భవన్ లో జరిగిన తెలంగాణ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు
ఎన్నికల సందర్భంగా అన్ని బూర్జువా పార్టీల వారు అన్ని వర్గాల ప్రజలకు తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక, ప్రజలను మరిచిపోవడం పరిపాటి అయిందని, ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అనేక వరాలు ప్రకటించిందని కానీ అమలు చేయడంలో తాత్సారం జరుగుతోందని, ముఖ్యంగా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు పథకం అరకొరగానే అమలు జరుగుతోందని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కూడా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, పెళ్లయిన ప్రతి మహిళకు 2500 పథకం ఇంతవరకు అమలులోచుకోలేదని ఇంకా మహిళలకు సంబంధించిన అనేక పథకాలు పెండింగ్లో ఉన్నాయని వాటన్నిటినీ సాధించుకునేందుకు మహిళా సమాఖ్య కృషి చేయాలని క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని ఉద్యమాల ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతుందని ఆమె ఉద్భోదించారు
సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…. సూర్యాపేట జిల్లాలో తెలంగాణ మహిళా సమాఖ్య బలోపేతానికి తగు చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అయిన అంగన్వాడి, ఆశ,మధ్యాహ్నం భోజన వర్కర్స్ అలాగే ఇతర సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు జీవిత భద్రతకై ఉద్యమాలు రూపొందించి అందుకు తగు కార్యాచరణను రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
ఎందరో త్యాగధనుల త్యాగాలతో పునీతమైన తెలంగాణ మహిళా సమాఖ్య లో పనిచేయడం అభినందనీయమని ఈ మహాసభలో భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం రూపొందించిన పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలకు ఇటు మహిళలకు తెలంగాణ మహిళా సమాఖ్య వారధిలా పనిచేయాలని ఆయన సూచించారు
సమావేశానికి ఉప్పతల కోటమ్మ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరo మల్లీశ్వరి మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ లక్ష్మి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం మహిళా సమాఖ్య నాయకురాలు పశ్య పిచ్చమ్మ సాతూరు అలివేలు యల్లావుల ఉమ, రెమిడాల జయసుధ భీమిశెట్టి పద్మ సుందరి పద్మ రావిరాల భ్రమరాంబ నూతన గంటి నరసమ్మ పాల్గొన్నారు