హుజూర్ నగర్ కే కే మీడియా మార్చ్ 9:
మన దేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అంశం లో మార్పు మొదలైందని హుజూర్నగర్ సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యామ్ కుమార్ అన్నారు. గురువారం హుజూర్నగర్ కోర్టు ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ 7000 సంవత్సరాల పూర్వం నుంచి భారతదేశంలో మహిళను పూజిస్తూ మహిళకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కొంతకాలం మహిళల పట్ల వివక్షత ఎదురై ఆడపిల్ల పుడితేనే ఇబ్బందికర పరిస్థితుల నుండి నేడు ఆడపిల్ల పుట్టుకను ఘనంగా జరుపుకునే రోజు వరకు వచ్చిందని మహిళలు అన్ని రంగాల్లో స్వశక్తితో మునుముందుకు పోతున్నారని రాజ్యాంగం కల్పించిన హక్కులతో న్యాయ వ్యవస్థ మహిళలపై జరుగుతున్న అకృత్యాల పట్ల బలమైన చట్టాలు రూపొందిస్తుందని తెలిపారు. మహిళలు స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు
ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ సకల సంపదలు బిల్లు బిరుస్తాయన్న మన భారతీయ నానుడి కొనసాగాలని ప్రస్తుతం మన దేశంలో మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి విద్యార్థికులుగా వివిధ రంగాల్లో కీలక భూమిక పోషిస్తున్నారని న్యాయవ్యవస్థలో కూడా ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని ఇలానే అన్ని రంగాల్లో ముందుకు నడవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో సిఐ రామలింగారెడ్డి అంగన్వాడీ సిడిపిఓ విజయలక్ష్మి, న్యాయవాదులు చల్లా కృష్ణయ్య రవికుమార్ జక్కుల నాగేశ్వరరావు కాల్వ శ్రీనివాసరావు సుంకర ప్రదీప్తి ఎస్సై వెంకట్ రెడ్డి అంగన్వాడి టీచర్లు న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం మహిళా ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు