మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పాటు అందిస్తాయని హుజూర్నగర్ బా ర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ సభ్యులు సాముల రామిరెడ్డి అన్నారు. శనివారం పెంచికల్దీన్నే కృష్ణకుమారి ట్రస్ట్ భవన్ లో ఏర్పాటుచేసిన ఉచిత కొట్టు శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు, మహిళలు ఆర్థిక స్వలంబన కోసం శిక్షణ కార్యక్రమాల ఏర్పాటు చేస్తూ ఉన్న ట్రస్టు సేవలను కొనియాడారు. ఈ అవకాశాన్ని ప్రతి గృహిణి వినియోగించుకొని స్వతంత్ర ఆదాయాన్ని పెంపొందించుకునే దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ ట్రస్ట్ అభివృద్ధి కోసం లక్ష రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. తన వంతు సహకారం తో పాటు ప్రభుత్వపరంగా అందించే సహకారాలకు తన తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు.
ట్రస్ట్ ఉపాధ్యక్షులు, పెంచికల్ దిన మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ సీనియర్ న్యాయవాదులు నారపరాజు శ్రీనివాసరావు, నెట్టే సత్యనారాయణ, కుక్కడపు బాలకృష్ణ , అంబటి శ్రీనివాస్ రెడ్డి , కవి నందిగామ రత్నకుమార్ , సుంకర ప్రదీప్తి, ఆరిబండి సావిత్రి , సావిత్రి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

