పాలకీడు కేకే మీడియా నవంబర్ 24
ప్రజా పోరాటాల వారిది కామ్రేడ్ మల్లు లక్ష్మి నీ గెలిపించండి అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ అన్నారు
శుక్రవారం కామ్రేడ్ మల్లు లక్ష్మి గెలిపించాలని కోరుతూ గురుగుంట్ల పాలెం గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభిస్తూ సిపిఎం మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం ప్రజా ఉద్యమాల్లో మమేకమై తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం రాజకీయ వారసురాలుగా ప్రజలతో మమేకమైతున్న మల్లు లక్ష్మి ని గెలిపించాలని ఆయన కోరారు
ఉమ్మిడి నేరేడుచర్ల మండలంలో అరిబంది లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నేరేడుచర్ల జూనియర్ కాలేజీని ఆయన తీసుకువచ్చి పేద ప్రజల విద్యార్థులకు అండగా ఉన్నారని ఆయన అన్నారు అంతేకాకుండా ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం నుండి పెంకుటిల్లు మంజూరు చేపించినారని అదేవిధంగా మొట్టమొదటిసారిగా పాలకవీడు మండలంలో తను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే గ్రామాల్లోకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు ప్రజలందరూ ఎమ్మెల్యేగా గెలిచిన జూలకంటి రంగారెడ్డి ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని గుర్తు చేశారు మఠంపల్లి మండలంలో గుర్రంపూడ్ లిఫ్టు మండలంలో లింక్ రోడ్లు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు లో వోల్టేజీ సమస్యతో ఎదుర్కొంటున్న సందర్భంలో అమరవరంలో సబ్స్టేషన్ పాలకీడు వద్ద సబ్స్టేషన్ ముకుందాపురం వద్ద సబ్స్టేషన్ జాన్పాడు వద్ద సబ్స్టేషన్ దర్శించర్ల వద్ద సబ్స్టేషన్లో నిర్మించి రైతాంగాన్ని కాపాడాలని ఆయన అన్నారు అంతే కాకుండా మిర్యాలగూడ నేరేడుచర్ల మధ్యలో ఉన్న మూసీ నదిపై వంచన నిర్మాణం శూన్య పాడ్ మరియు దామరచర్ల మధ్య మూసి పై వంత నిర్మాణం మీగడం పాడు తండా రాఘవాపురం మధ్యలో వేములూరు వాగు పై వంతెన నిర్మాణం హనుమంతుల గూడెం కల్మలచెరువు మధ్య వేములూర్ వాగు పై వంతెన నిర్మాణం ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆయన గుర్తు చేశారు నేరేడుచర్ల మండలంలో ప్రభుత్వ కార్యాలయం ఏర్పాటు కోసం జన్మభూమి కార్యక్రమం కింద 30% కంట్రిబ్యూషన్ కట్టాలని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇస్తే దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ పై సమ్మె చేసి 30% కంట్రిబ్యూషన్ వారితో కట్టించి నేరేడుచర్లలో ఎంపీపీ కార్యాలయం పోలీస్ స్టేషన్ ఎండిఓ కార్యాలయం ఎంఈఓ కార్యాలయం నిర్మించిన ఘనత సిపిఎం పార్టీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి దేనని ఆయన అన్నారు అందుకే పేద ప్రజల పక్షాన నిరంతరం పనిచేస్తున్న మల్లు లక్ష్మికి గెలిపించాలని కోరారు
ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు పురుషోత్తం రెడ్డి వెంకటేశ్వర్లు మహిళలు పాల్గొన్నారు