హైదరాబాద్ కేకే మీడియా జూన్ 29
రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నదని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, మేడ్చల్, కరీంనగర్, కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్నగర్ జిల్లాల్లో డెంగీ వ్యాధి, కొత్తగూడెం, ములుగు, ఆసీఫాబాద్, వరంగల్రూరల్, అర్బన్, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మలేరియా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని ముందస్తుగా గుర్తించింది. గడిచిన మూడేళ్లు కేసుల తీరును గమనించి ముందస్తుగా అప్రమత్తంగా కావాలని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ ఏడాది ఇప్పటికే అధికారికంగా 583 డెంగీ కేసులు నమోదవగా, 128 మలేరియా కేసులు నిర్ధారణ అయ్యాయి. రికార్డుల్లోకి ఎక్కనివి రెట్టింపు స్థాయిలో ఉండొచ్చనే అభిప్రాయాన్ని ఆఫీసర్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2022లో 203 మలేరియా కేసులు, 723 డెంగీ కేసులు తేలాయి. ఈ ఏడాది పెరిగే ఛాన్స్ఉన్నదని ఆఫీసర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మంత్రి హరీష్రావు అన్ని జిల్లాల డీఎమ్హెచ్వోలతో రివ్యూ నిర్వహించారు.
ముందు జాగ్రత్త కిట్లు రెడీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ
రాష్ట్ర వ్యాప్తంగా 35 ఆసుపత్రులను డెంగీ, మలేరియా వ్యాధుల చికిత్స కొరకు వినియోగించనున్నారు. ఈ మేరకు ఆయా ఆసుపత్రులలో 1.23 లక్షల డెంగీ నిర్ధారణ కిట్లు, ఆరు లక్షల మలేరియా కిట్లను స్టాక్పెట్టారు.పేషెంట్ల తాకిడిని బట్టి మళ్లీ కొనుగోలు చేయాలని ప్రభుత్వం టీఎస్ఎంఎస్ఐడీసీ సంస్థకు ఆదేశాలిచ్చింది. దీంతో పాటు 26 కంపొనెంట్ సెపరేటర్స్ను ఏర్పాటు చేశారు. ప్లేట్లెట్స్ పడిపోయి నోళ్లకు ఎక్కించేందుకు వీటిని వినియోగించనున్నారు. దీంతో పాటు హైరిస్క్ జిల్లాల్లో మొదట యాంటిలార్వ ఆపరేషన్, ప్రై డే డ్రై డే వంటి కార్యక్రమాలను షురూ చేయనున్నారు. ఈ మేరకు పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలతో వైద్యశాఖ సమన్వయం కానున్నది.