నేరేడుచర్ల కేకే మీడియా ఫిబ్రవరి 25
నేరేడుచర్లలో ఉరి వేసుకోని యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం పట్టణంలో నీ ఆటోనగర్ లో చోటు చేసుకుంది. ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 14 వార్డులో నివాసం ఉంటున్న షేక్ అలీ (25) ప్రైవేట్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య అజ్మత్ కు ఇతనికి తరుచు గోడవులు రావడంతో గత సంవత్సరం 8-9-22న అజ్మత్ నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇరువురు రాజీకి వచ్చి వచ్చి 11-11-22 న లోకాయుక్తలో కేసు కొట్టివేశారు. అనాటి నుండి ఇరువురి మధ్య తరచూ గొడవలు వస్తూ ఉఇ. ఈనెల 22 న ఇంటి నుండి భయటకు వెళ్లిన అలీ తిరిగి ఇంటికి రాలేదు. శనివారం ఉదయం గృహాల మధ్యలోని పాడు పడ్డ ట్రాక్టర్ షెడ్ ఆవరణలో నుంచి దుర్వాసన వస్తుండడంతో సమీప గృహాస్థులు మున్సిపాలిటీ కార్యాలయంలో పిర్యాదు చేశారు. దీంతో సిబ్బంది వచ్చి పరిశీలించగా షెడ్ లోని ఓ గదిలో వ్యక్తి ఉరి వేసుకోని ఉండడాన్ని గమనించి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా సుమారు 5 రోజుల క్రితం ఉరి వేసుకోని మృతి చెంది ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన పరిసర ప్రాంత ప్రజలు షేక్ అలీగా గుర్తించారు. దీంతో వారి కుటుంభ సభ్యులకు సమాచరం ఇవ్వడంతో వారు వచ్చి గుర్తించారు. ఎన్నిసార్లు పోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినట్ల భార్య తెలిపింది. షేక్ అలీ ది స్వస్థలం నల్లగొండ. వివాహం అయిన నాటి నుంచి భార్యతో కలిసి ఇక్కడే కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. అనంతరం సంఘటనా స్థలాన్ని హుజూర్ నగర్ సీఐ రామలింగారెడ్డి పరిశీలించారు. కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడ్చర్ల ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.