హుజూర్నగర్ కేకే మీడియా డిసెంబర్ 19
యువత చెడు మార్గాలలో వెళ్లకుండా ఉండాలి..
యువత చదువు,ఉద్యోగాలపై దృష్టి సారించాలి..
కోదాడ డిఎస్పీ ప్రకాష్.
యువత మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలకు బానిస కాకుండా ఉండాలని అలాగే యువత చెడు మార్గాలలో వెళ్లకుండా ఉండాలని, యువత చదువు,ఉద్యోగాలపై దృష్టి సారించాలని కోదాడ డిఎస్పీ ప్రకాష్ అన్నారు.బుధవారం హుజూర్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణ లో హుజూర్ నగర్ సర్కిల్ లోని 5 పోలీసు స్టేషన్ల పరిధిలోని గంజాయి అక్రమ రవాణా,గంజాయి వినియోగించే వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా కోదాడ డిఎస్పి ప్రకాష్ మాట్లాడుతూ మత్తు పదార్ధాలకు అలవాటు పడి యువత చెడు మార్గాలలో వెళ్లకుండా ఉండాలని చదువు ,ఉద్యోగాల పై దృట్టిపెట్టి జీవితంలో స్థిరపడాలని అన్నారు. మత్తు పదార్ధాలు వినియోగం, అక్రమ రవాణా సంబందిత నేరాలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారిపై కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సిఐ రామలింగారెడ్డి, హుజూర్ నగర్, గరిడేడేపల్లి, మఠంపల్లి, నేరేడుచర్ల,పాలకీడు, ఎస్సైలు హరికృష్ణ, వెంకటరెడ్డి, బాలకృష్ణ,పరమేష్,లింగయ్య ,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.