హుజుర్నగర్ కేకే మీడియా ఆగస్ట్ 29:
చింతలపాలెం, మఠంపల్లి మండలాలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పలు ఆబివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపన చేయుటకు విచేస్తున్న సందర్బంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గురువారం పరిశీలించారు.చింతలపాలెం మండలకేంద్రంలో తహసీల్దార్, పోలీస్ స్టేషన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు నిర్మించుటకు శంకుస్థాపన ఏర్పాట్లు, అలాగే హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి, మంత్రి పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులకు పలు సూచనలు చేశారు.తదుపరి కిష్టాపురం నుండి
పి ఆర్ సిమెంట్ ప్యాక్టరీ వరకు నిర్మించే రోడ్ శంకుస్థాపన ప్రదేశాన్ని పరిశీలించారు.
అనంతరం హుజూర్ నగర్ నుండి మట్టపల్లి వరకు 10 మీటర్ల వెడల్పు తో నిర్మించే రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమ ఏర్పట్లను మట్టంపల్లి వద్ద జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మఠంపల్లి లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరీశిలించారు. మందుల స్టాకు వివరాలను అడిగితేలుసుకున్నారు.సిబ్బంది హజరు,పనితీరును ఆడిగితేలుసుకోన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. శ్రీనివాసులు, తహసీల్దార్లు సురేందర్ రెడ్డి, మంగ,ఆర్ & బి డి. ఈ. రమేష్, ఎ.ఈ. సతీష్,ఎం పి డి ఓ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వాసుదేవరావు,ఆర్ ఐ జానీ పాషా,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.