కేకే మీడియా సూర్యాపేట నవంబర్ 13
మంత్రి దత్తత గ్రామం లో కాంగ్రెస్ ఖాళీ
పెన్ పహాడ్ మండలం చీదెళ్ళలో ఖాళీ అయిన కాంగ్రెస్
భీఆర్ఎస్ లో చేరిన 52 మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
గులాబీ కండువాతో స్వాగతం పలికిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట
సూర్యాపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుంది.. భీఆర్ఎస్ అభ్యర్థి రాష్ట్రమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మద్దతుగా టిఆర్ఎస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. తాజాగా పెన్ పహాడ్ మండలంలోని మంత్రి దత్తత గ్రామమైన చీదెళ్ల
లో అభివృద్ధి ప్రదాత జగదీష్ రెడ్డి తోనే మా ప్రయాణం అంటూ కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు భీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో రవీందర్ రెడ్డి, వెన్న సీతారాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నలబోలు వెంకటరెడ్డి, గుర్రం రాంరెడ్డి, పల్లె వెంకట్ రెడ్డి, హుస్సేన్ తో సహా 52 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా కప్పి మంత్రి జగదీశ్ రెడ్డి ఆహ్వానం పలికారు. గ్రామ సర్పంచ్ పరెడ్డి సీతారాంరెడ్డి, ఎంపిటిసి జూలకంటి వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి నాయకులు గుర్రం అమృతారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కీర్తి వెంకట్రావు ఆధ్వర్యం లో చేరికలు కొనసాగాయి.