గరిడేపల్లి కేకే మీడియా జూన్ 21:
రైతుల దుందుడుకు చర్యతో ఒక వైన్ షాపే మంటల్లో చిక్కుకొని దగ్ధమైన సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగింది. గరిడేపల్లి మండల కేంద్రంలో ఒక వైన్స్ దుకాణాన్ని పొలాల మధ్యలో ఏర్పాటు చేయడంతో ఒక రైతు ఓడిపోయేలను తగలబెట్టేందుకు నిప్పంటించగా గాలి దుమారం చెలరేగి మంటలు పొగ వ్యాప్తి చెంది పక్కనే ఉన్న వైన్స్ దుకాణంలోకి మంటలు ఎకపోయగా సహజంగా మండే గుణమున్న ఆల్కహాల్ మంటలు చెలరేగడంతో దుకాణం పూర్తిస్థాయిలో దగ్ధమై పెద్ద పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయి. అక్కడికి వచ్చిన మందుబాబులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎగిసి పడ్డ మంటలతో దట్టమైన పొగలతో అక్కడి వాతావరణం భయానకంగా మారింది.
వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు వరి కోయలు తగలబెట్టడం సరైన పద్ధతి కాదని రైతులకు ఎన్నిసార్లు తెలియపరిచిన పదేపదే ఇలా పొలంలో ఓరికోయేలను తగలబెడుతూ భూమిలోని విలువైన వాన పాములు లాంటి పంటలకు ఉపయోగపడే జీవరాశులను చంపుతూ మోటార్లు పైపులు వైర్లు తదితర సామాన్లు తగలబడుతున్న సంఘటనలు పునరావృతం అవుతున్న పట్టించుకోకుండా చేస్తున్న ఇలాంటి దుందుడుకు అనాలోచిత చర్యల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఒక ఉదాహరణగా ఈ సంఘటన మిగిలిపోనుంది