నేరేడుచర్ల కే కే మీడియా జనవరి 14
సంక్రాంతి పండుగ ప్రారంభ సందర్భంగా ఆదివారం నాడు నేరేడుచర్ల లోని ఎస్ఆర్కే రెసిడెన్సి లో సభ్యులందరూ తెల్లవారుజామున సాంప్రదాయ భోగిమంటల కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల నడుమ నిర్వహించారు.
42 మంది సభ్యులు ఉన్న అతిపెద్ద అపార్ట్మెంట్ లో ప్రతి వేడుకను ఘనంగా నిర్వహించుకునే ఆనవాయితీ లో భాగంగా తెల్లవారుజామున లేచి అపార్ట్మెంట్ ముందు ముగ్గులు వేసి భోగి మంటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించి వారి వారి ఇళ్లలోని పాత వస్తువులను మంటలు వేసి నృత్యాలు, కోలాటం లతో సందడిగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
భోగిమంటల సంబరాల్లో ఎస్ ఆర్ కే రెసిడెన్సి సభ్యులు
RELATED ARTICLES