*భూభారతి చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది.*
యాక్టులో పేర్కొన్నట్లుగా విలేజ్ అకౌంట్ నిర్వహించేందుకు ప్రతి ఊరికొక్కరు అనివార్యం.అందుకే విలేజ్ లెవెల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ఐతే పూర్వపు వీఆర్వోలకు ఆప్షన్లు ఇస్తూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి వీఆర్వోలందరినీ లాటరీ పద్ధతిన వివిధ శాఖలకు, కార్పొరేషన్లకు బలవంతంగా పంపారు. కొందరినైతే తాత్కాలిక ఉద్యోగులుగా మార్చగా ఏండ్ల తరబడి ఎలాంటి వేతనం లేకుండా పని చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. కొత్త చట్టం ప్రకారం ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్ ని నియమిస్తున్నట్లు సీసీఎల్ఏ ప్రకటించారు. ఎవరైతే తిరిగి రెవెన్యూ శాఖకు రావాలనుకుంటున్నారో వారందరికీ ఆప్షన్లు ఇచ్చారు. ఈ మేరకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ని అందించారు. https://docs.google.com/forms/d/e/1FAIpQLSdMb0_y0V7euTUq-cD4Xj5uiml1-QGALCiYeCB2T3TxU9ApLw/viewform ఈ ఫారం ద్వారా పూర్తి వివరాలను సమర్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందులో విలేజ్ లెవెల్ ఆఫీసర్ లతో పాటు సర్వేయర్ గా పని చేసేందుకు కూడా చాన్స్ ఇచ్చ