[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
మిర్యాలగూడ కేకే మీడియా సెప్టెంబర్ 26
ఒకప్పుడు తెర వెనుక హోం శాఖను శాసించి ప్రత్యక్ష రాజకీయాల్లో మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ నుండి వరుసగా రెండుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేస్తున్నరు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. మిర్యాలగూడ నియోజకవర్గంలో సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఉమ్మడి మిర్యాలగూడ నియోజకవర్గంలో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ దివంగత శాసనసభ్యుడు అరిబండి లక్ష్మీనారాయణ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తిరిగి అదే సామాజిక వర్గం నుంచి మొదట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన నలమోతు భాస్కరరావు రాష్ట్రంలో 2014 ప్రభంజనం లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలలో భాస్కర్ రావు కూడా ఉండడం తన రాజకీయ చాణుక్యతతో రాష్ట్ర నాయకత్వాన్ని ఒప్పించి మిర్యాలగూడ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూనే ఆసియాలోనే బియ్యం ఎగుమతులు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా పేరు పొందిన వ్యాపార కేంద్రం మిర్యాలగూడ వ్యాపారులకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ వారినే కాకుండా ఇతర అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీరుస్తూ అందరివాడిగా పేరు పొంది 2018 ఎన్నికల్లో పోటీ చేసి మరో మారు గెలుపొంది తన సత్తా చాటి తన రాజనీతి చాణిక్యతతో అందరినీ కలుపుకుపోతూ మరో మారు హ్యాట్రిక్ దిశగా తిరుగులేని నాయకుడిగా అధికార పార్టీ అభ్యర్థిగా గెలుపొందేందుకు సిద్ధమవుతున్నారు. అధికార బీఆర్ఎస్ నుండి భాస్కరరావు పోటీ చేయనుండగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుండి బత్తుల లక్ష్మారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత రాజకీయ ఉద్దండుడు కుందూరు జానారెడ్డి కుమారులతో పాటు ఇతరులు పోటీ పడుతుండగా అధికార బిఆర్ఎస్ పార్టీ నుండి తెగదెంపులు చేసుకున్న కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్తో పొత్తు పొడిచే అవకాశం ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో సిపిఐ, సిపిఎంతో పొత్తులు కలిస్తే మిర్యాలగూడ స్థానాన్ని కచ్చితంగా సిపిఎం కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ మిర్యాలగూడ సీటును వదులు కునే అవకాశం ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జూలకంటి రంగారెడ్డి చివరి ప్రయత్నం గా పోటీలో దిగనున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఇప్పటికే గ్రామ గ్రామాన విస్తృత ప్రచారంలో రంగన్న నిమగ్నమయ్యారు. పొత్తు కుదిరితే కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తే మూడుసార్లు గెలిచిన అనుభవం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలతో సంబంధాలు ప్రజలతో మమేకమైన అనుభవం రంగారెడ్డి గెలుపుకు దోహత పడే అవకాశం ఉన్నప్పటికీ పొత్తు ఉంటుందో లేదో అన్న సందేహాలు లేకపోలేదు. పొత్తు లేకున్నా ఉభయ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. మరో ప్రధాన పోటీ దారైన కాంగ్రెస్ ఆశావాహ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొంది మునిసిపల్ చైర్మన్గా కాంగ్రెస్ తరపున పోటీ చేసి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికై ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ను గెలిపిస్తా అన్న ధీమాతో ఉన్నప్పటికీ కాంగ్రెస్లో ఉన్న కుమ్ములాటలు లక్ష్మారెడ్డి కి నష్టం చేకూర్చే ప్రమాదం ఉంది. నిజానికి టికెట్ రాకుండా చేసే ప్రయత్నం తో పాటు కమ్యూనిస్టులు మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కోరుకోవడం ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్ష్మారెడ్డి ఒకవేళ కాంగ్రెస్ నుంచి అవకాశం లభించకుంటే అవసరమైతే బిజెపి అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాకముందే తన చాణుక్యతతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో జానారెడ్డి కి షాడో గా రాష్ట్రంలో ఒక ప్రధాన శాఖలో చక్రం తిప్పిన భాస్కరరావు ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో రెండుసార్లు దిగ్విజయంగా శాసనసభ్యుడిగా పదవీ కాలాన్ని పూర్తిచేసుకుని హ్యాట్రిక్ దిశగా తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించి బిఆర్ఎస్ పార్టీ అదినాయకత్వం దృష్టిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హాట్రిక్ విజయంతో సామాజిక వర్గం కోటాలో ప్రమోషన్ కొట్టేందుకు . ఉవ్వెళ్ళు ఊరుతున్నాడు. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా 12 స్థానాల్లో అధికార పార్టీ గెలిచే మొదటి స్థానంగా చెబుతున్న మిర్యాలగూడ ప్రజలు అనుకున్న రీతిలో ఆశీర్వదిస్తే ఇక భాస్కరుడి విజయం నల్లేరు మీద నడకే.