హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 10
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం చివరి రోజు అయిన నవంబర్ పది నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చల్లా శ్రీలత రెడ్డి భారీ జన సందోహం నడుమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
మొన్నటివరకు బి ర్ యస్ పార్టీలో హుజూర్నగర్ నియోజకవర్గ నేరేడుచర్ల మున్సిపాలిటీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా నేరేడుచర్ల పట్టణ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసే ఇటీవల బీజేపీలో చేరి హుజూర్నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా భారీ జన సమీకరణ చేసి మేళతాళాలతో
కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా రాజీవ్ చంద్రశేఖర్ కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార శాఖ సహాయ మంత్రి, సీనియర్ బిజెపి నాయకురాలు (ప్రముఖ సినీనటి) శ్రీమతి జీవిత రాజశేఖర్, కర్ణాటక రాష్ట్ర ఎమ్మెల్సీ శ్రీ రవికుమార్, బిజెపి జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి , రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి పో రెడ్డి కిషోర్ రెడ్డి లతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.
భారీ సమీకరణ నేపథ్యంలో హుజూర్నగర్ కిక్కిరిసిపోయింది. సమీకరణకు చేసిన బల నిరూపణ జన సమీకరణ తో బిజెపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉరకలేసింది.