Saturday, June 14, 2025
HomeNationalభారీగా ఎర్రచందనం స్వాధీనం

భారీగా ఎర్రచందనం స్వాధీనం

*3.5 కోట్లు రూపాయలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం*…

*తమిళనాడు రాష్ట్రంకు చెందిన ఇద్దరు నిందితులు అరెస్ట్*….

*సినీ పక్కిలో పేపర్ బండిల్స్ లోడ్ మధ్యలో కోట్ల విలువైన ఎర్రచందనం అక్రమ రవాణా*

*అటవీ పరిరక్షణ చట్టం దొంగతనం ఎర్రచందనం స్మగ్లింగ్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు*

*పోలీసులు గుర్తుపట్టలేని విధంగా పలు కోణాలలో పలు విధాలుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తింపు*

*గంజాయి పై ఫోకస్ పెడుతున్నాం గుంటూరు జిల్లా ఎస్పీ పి సతీష్ కుమార్ వెల్లడి*….

*కేసు దర్యాప్తు అధికారులు అయినా మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు, ఎస్సై సిహెచ్ వెంకట్, వారి సిబ్బంది పక్కా సమాచారంతో పట్టుకున్నారు*

తమిళనాడు నుండి పశ్చిమ బెంగాల్ కు అక్రమంగా తరలిస్తున్న 4.5 కోట్ల రూపాయలు విలువ చేసి 1201 కేజీల బరువు గల 49 ఎర్రచందనం దుంగలను ఏ4 పేపర్ బండిల్ మధ్యలో పెట్టి లారీలో తరలిస్తుండగా రాబడిన సమాచారం మేరకు మంగళగిరి నగర సమీపంలోని కాజా టోల్ గేట్ వద్ద తనిఖీ చేసి స్వాధీనపరుచుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా ఎస్పీ మాట్లాడుతూ అక్రమ రవాణా చేస్తున్న లారీ డ్రైవర్ తమిళనాడు రాష్ట్రం చెందిన సారతి కన్నన్, జోయ్ ప్రవీణ్ గురువారం అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఈ కేసుకు సంబంధించి దీనికి ఎవరు ఉన్నారు అనే కోణం నుండి దర్యాప్తు చేస్తున్నామని సతీష్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా తమిళనాడు నుండి అస్సాం గౌహతి పశ్చిమ బెంగాల్లోని సిరుగురి మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు వేరే మార్గం ద్వారా అయితే కష్టంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మీదుగా తరలించేందుకు ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ దుంగలను ప్లాన్ చేసుకొని రకరకాల పద్ధతులతో వీటిని తరలిస్తారన్నారు. గంజాయి అధికంగా ఫోకస్ పెట్టమని గతంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గిందని, గంజాయి మత్తుపదార్థాలను క్రయ విక్రయాలు జరిపే వారిపై అధికంగా కేసులు నమోదు చేశామన్నారు. అదేవిధంగా గంజాయి వినియోగించే వారిని గుర్తించి వారి తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కోర్టు ముందు హాజరు పరుస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏ ఎస్పీ రవికుమార్, డి.ఎస్.పి భార్గవి, నార్త్ డిఎస్పి మురళీకృష్ణ, మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు, పట్టణ సీఐ డి వినోద్ కుమార్, రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, సిబ్బంది, ఏ ఎస్ ఐ పి శ్రీనివాసరావు టి బీమా శంకరరావు, బి రమేష్ బాబు, కే రత్నరాజు, హెడ్ కానిస్టేబుల్ డి శ్యామ్ కుమార్, బి రామలింగేశ్వరరావు, కానిస్టేబుల్ గణేష్ బాబు, రాము తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments