హుజూర్నగర్ కేకే మీడియా నవంబర్ 4:
హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కొండ హరీష్ గౌడ్ ని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా శనివారం జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి మరియు హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి నియామకం చేశారు. నియామక పత్రం అందించిన అనంతరం అనంతరం జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి మాట్లాడుతూ కొండ హరీష్ గౌడ్ హైదరాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో సుమారు 10 సం. రాలు పార్టీ కోసం పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారని అతనిని జిల్లా కార్యదర్శి గా నియమించడం ద్వారా పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పార్టీకోసం శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రభారి ఈవి రమేష్, విజయ్ భాస్కర్ రెడ్డి, గంగిపల్లి స్వామి, గుండెబోయిన వీరబాబు, పత్తిపాటి విజయ్, అంబళ్ళ నరేష్, మస్తాన్ రెడ్డి మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.