నేరేడుచర్ల కేకే మీడియా
120 మంది చావుకు కారణమైన బోలె బాబాలు తక్షణమే అరెస్టు చేయాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రధాన కార్యదర్శి రాపోలు నవీన్ డిమాండ్ చేశారు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని హత్రాస్ జిల్లా ఫుల్ రయీ గ్రామంలో జరిగిన బోలె బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఆయన పాద ధూళి సేకరించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి అట్టి సంఘటనలో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని క్షతగాత్రులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని సత్సంగ్ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన అధికారులపై వేటు వేయాలని కనీసం 5000 మంది కూడా కూర్చొనేందుకు వీలు లేని చోట 15 వేల మందికి ఎలా అనుమతించారని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు
ప్రజలు కూడా ఇలాంటి విషయాలలో చైతన్యవంతం కావాలని ఒకేసారి 100 ఉపగ్రహాలు కక్ష్య లోకి పంపించే స్థాయికి దేశం ఎదుగుతుంటే ఇంకా సన్యాసుల పాత ధూళి కోసం ఆరాటపడటం బాధాకరమని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని సాధువులు సన్నాసులు పకీర్లు రాజ్యమేలుతుంటే ఇలాంటివి జరగడం సహజమని ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన పాలకులే సన్నాసి వేషం వేసుకొని ఊరేగుతుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
సత్సంగు కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన అధికారితో పాటు, వారికి బందోబస్తు ఏర్పాటు చేయలేకపోయిన పోలీసు అధికారులతో పాటు, అందరి పైన చర్య తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వారి కోరారు
వారి వెంటకర్రీ సతీష్ రెడ్డి,ఊదర వెంకన్న, తక్కెళ్ళ నాగార్జున పాల్గొన్నారు