ఖమ్మం కేకే మీడియా ఫిబ్రవరి 20
ఖమ్మం కవయిత్రి గజల్ రచయిత్రి బైరి ఇందిరా క్యాన్సర్ తో పోరాడి తుది శ్వాస విడిచారు
తన చావు గురించి తాను రాసుకున్న కవిత్వం.
నిజంగా చాలా బాధాకరం
(బైరి ఇందిరా రాసుకున్న కవిత్వం…
నేను పోయినప్పుడు
నేను పోయినప్పుడు
ఓ కాగితాన్ని కప్పండి
రాసుకోడానికి పనికొస్తుంది
మట్టిలో కప్పెట్టకండి
మరీ గాలాడదు
పురుగూ పుట్రా ఉంటాయ్
పెన్సిలు, రబ్బరు, కర్చీఫ్
బ్యాగులో ఉండేలా చూడండి
సెల్ మర్చిపొయ్యేరు
బోర్ కొట్టి చస్తాను
దండలు గిండలు వెయ్యకండి
నాకు ఎలర్జీ
పసుపు గట్రా పూసి
భయంకరంగా మార్చకండి
పిల్లలు ఝడుసుకుంటారు
పైగా నన్ను గుర్తుపట్టాలి కదా
పుణ్యస్త్రీ, పాపపు స్త్రీ అని
పేర్లు పెట్టకండి
నాకు చిర్రెత్తుకొస్తుంది
నా సామాన్లన్నీ పడేయకండి
అడిగినవాళ్లకు ఇచ్చేయండి
మంగళవారమైనాసరే,
పాడెకు కోడిపిల్లను కట్టి హింసించకండి
ఇప్పుడైనా నా మాట నెగ్గనియ్యండి
డ్యాన్సులాడి లేట్ చెయ్యకండి
ఏదైనా టైం ప్రకారం జరగాలి
కాస్త చూసి తగలబెట్టండి
పక్కన మొక్కలుంటాయేమో
బడికి ఇన్ఫామ్ చెయ్యండి
వాళ్లు సెలవిచ్చుకుంటారు
దేనికీ ఇబ్బంది పడకండి
గొల్లవాళ్ల కొట్లో ఖాతా ఉంది
పిట్టకు పెట్టేదున్నా లేకున్నా
అన్ని రోజులూ అందరు
ఇక్కడే ఉండండి
మళ్లీ మళ్లీ చస్తానా ఏంటి
పనిలో పని
కాష్టం దగ్గర
కవిసమ్మేళనం పెట్టండి
నేనూ ఉ(వి)న్నట్టుంటుంది…
కొన్ని చావులకు నిజాలు నిర్ధారణ లు అవసరం లేదు మనం చేసే మంచి పనులే ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి