బేరియన్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
సూర్యాపేట జిల్లానేరేడుచర్ల కేకే టీవీ జనవరి 1
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు బిరియాన్ బాపిస్ట్ చర్చిలో నూతన సంవత్సర వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద క్రిస్టియన్ కుటుంబాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం చిన వెంకట్ రెడ్డి, కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్ బట్టలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కొణతం చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖ శాంతులతో ఉండాలని కోరారు. కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ కరీముల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొణతం రాoరెడ్డి, పాండు నాయక్ సురేష్ రెడ్డి,బచ్చలకూరి సైబాలు, ఏసుబాబు,మాజీ జెడ్పిటిసి మేరీ రాజు, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పెద్ద పంగు కాటయ్య,
పాస్టర్ గిద్దోను రీచోడు తదితరులు పాల్గొన్నారు.