హుజూర్నగర్ కేకే మీడియా సెప్టెంబర్ 29
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హుజూర్నగర్ నియోజకవర్గంలో అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థుల ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయంటూ వారి వారి ప్రయత్నాల్లో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థులైన అధికార బీఆర్ఎస్ ,కాంగ్రెస్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్న వేళ ఇటు బిఆర్ఎస్ అటు కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు వారి వారి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అధికార బీఆర్ఎస్ లో పెద్దగా పోటీ లేదనుకున్నప్పటికీ నేరేడుచర్లకు చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి టిఆర్ఎస్ ముందస్తు అభ్యర్థుల ప్రకటనకు ముందే రాష్ట్ర నాయకత్వంలోని కొందరు నేతలను కలిసినట్టు వారు హామీ ఇచ్చినప్పటికీ సిట్టింగులకే అవకాశాలు అన్న నేపథ్యంలో సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న శానంపూడి సైదిరెడ్డి పేరే అభ్యర్థిగా వెలువడినట్లు సమాచారం. మేళ్లచెరువు నుంచి పారిశ్రామికవేత్త రియల్ టర్ కూడా టిఆర్ఎస్ టికెట్ పై కన్నేసినప్పటికీ అతనికి అవకాశం దొరకనట్లే అన్న భావనలో సైలెంట్ అయిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ శ్రీలత రెడ్డి మాత్రం బీఫామ్ ఇవ్వలే కదా చివరి వరకు పోరాడితే తప్పేముందున్న తన అంచనాలతో గత కొంతకాలం నుండి నియోజకవర్గానికి దూరంగా ఉంటూనే తన ప్రయత్నాలు కొనసాగిస్తూ ఒకవేళ టిఆర్ఎస్ నుండి టికెట్ లభించకుంటే బిజెపి అభ్యర్థిగా నైనా అసెంబ్లీ బరిలో ఉండాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో మూడు పర్యాయాలు హుజూర్నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా పనిచేసే నాలుగవ దఫా గెలిచినప్పటికీ ఎంపిక అవకాశం లభించడంతో ఎమ్మెల్యేగా రిజైన్ చేసి నల్లగొండ ఎంపీగా గెలిచిన నలమాద ఉత్తంకుమార్ రెడ్డి తిరిగి హుజూర్నగర్ బరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ఇప్పటికే తన అభిమానులకు కార్యకర్తలకు తెలియపరచి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్న పరిస్థితుల్లో తన సతీమణి కోదాడ నుండి అసెంబ్లీ బరిలో ఉంటుందని తెలియపరిచినప్పటికీ కాంగ్రెసులో ఒకే కుటుంబంలో ఇద్దరికీ అవకాశం లభించదని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు నియోజకవర్గంలో ఒకటి రెండు చోట్ల బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో భాగంగా ఓజో స్వచ్ఛంద సంస్థ పేరుతో గత మూడేళ్లుగా హుజూర్నగర్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో యువతను ఆకట్టుకొని ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం కల్పిస్తే హుజూర్నగర్ దశ దిశ మారుస్తానంటూ ప్రచారం చేసుకుంటూ దూసుకు వెళ్లిన పిల్లుట్ల రఘు కాంగ్రెస్ అభ్యర్థిగా అందున బిసి అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందని అధిష్టానం ఇచ్చిన అవకాశం లో దరఖాస్తు చేసుకోగా ప్రయత్నాలు విరమించకుండా హైదరాబాదు నుండి ఢిల్లీ దాకా తన పరిచయాలు ఉన్న నేతల ద్వారా ఇప్పటికీ అసెంబ్లీ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా బిసి వాడిగా దిగేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ నుంచి అవకాశం లభించుకుంటే వేరే పార్టీల నుండి సైతం అవకాశం కోసం చూస్తున్నట్లు లేదంటే ఇండిపెండెంట్గానైనా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఇక మరో బీసీ అభ్యర్థిగా నేరేడుచర్ల పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ తంగళ్ళపల్లి విద్యాసాగర్ కాంగ్రెస్లో నాకు పరిచయాలు ఉన్నాయ్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా రాష్ట్ర అధిష్టానానికి దరఖాస్తు చేసుకొని తనకున్న పరిచయాలు సంబంధాలతో హుజూర్నగర్ బరిలో బీసీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇటు అధికార బీఆర్ఎస్ అటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ లలో బలమైన అభ్యర్థులు ఇప్పటికే ఉన్నప్పటికీ ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటూ ఉండడం బీఫాం లు వచ్చేవరకు ఈ అవకాశం ఉందన్న ఆశలు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తూ ఉండడం కచ్చితంగా తమకే వస్తుందని ఎవరికి వారు ఆశాభావాన్ని వ్యక్తం చేయడం. వారి అనుచరులకు మనకే కచ్చితంగా వస్తుందన్న సందేశాలు అందించడం కొంత ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులకు గందరగోళాన్ని సృష్టిస్తున్నప్పటికీ ఎవరి ఆశను ఎవరు కాదన లేరన్నది స్పష్టం.
ఇక అధినాయకత్వం ఎన్నికల బీఫామ్ లు అందించే వరకు ఇదే పంట కొనసాగిస్తుందా లేక ఆశావాహుల ప్రయత్నాలకు అవకాశం ఇస్తుందో వేచి చూడాలి