సూర్యాపేట కే కే మీడియా నవంబర్ 17
*-భూకబ్జాలు, బెదిరింపులు వట్టె జానయ్య నైజం*
*-రాంరెడ్డి దామోదర్ రెడ్డి చలనం లేని వ్యక్తి*
*-బీజేపీ శ్రేణులలో జోష్ నింపుతున్న చేరికలు*
*సూర్యాపేట :* పేద ప్రజలను ఏ రోజు కూడా పట్టించుకోని మంత్రి జగదీష్ రెడ్డిని నవంబరు 30న జరిగే శాసన సభ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ కండువాలను కప్పి ఆయన బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పేద ప్రజలు తమ కష్టాలను మంత్రి జగదీష్ రెడ్డి ని కలువడానికి ఆయన క్యాంప్ ఆఫీస్ కు పోతే, ఏ రోజు కూడా సామన్య ప్రజానీకాన్ని మంత్రి కలిసిన దాఖాలాలు లేవని ఆయన అన్నారు. మంత్రి జగదీష్రెడ్డి తల కిందికి దించుకోని క్యాంప్ ఆఫీస్ లోకి పోయాడు కానీ పేదల ప్రజలను పట్టించుకులేదని అన్నారు. ఎన్నికలు రావడంతో మంత్రి జగదీష్రెడ్డి పేద ప్రజలపై కపట ప్రేమ చూపుతున్నాడని అన్నారు. మంత్రి అండదండలతోనే వట్టె జానయ్య యాదవ్ పేద ప్రజల, గిరిజనుల భూములను ఆక్రమంగా లాక్కున్నాడని అన్నారు. వట్టె జానయ్య యాదవ్ ఆక్రమంగా సంపాదించిన డబ్బులో మంత్రి జగదీష్ రెడ్డి కి వాటాలు ఉన్నాయన్నారు. అభివృద్ధి పనుల ముసుగులో కాంట్రాక్టర్ల దగ్గర మంత్రి జగదీష్రెడ్డి కోట్ల రూపాయాల్లో కమీషన్ తీసుకుంటున్నాడని ఆయన ఆరోపించారు. రాంరెడ్డి దామోదర్రెడ్డి శకం ముగిసిందని, ఆయనను ప్రజలు ఆదరిస్తారని అనుకోవడం భ్రమలాంటిదన్నారు. ఆయన చలనం లేని వ్యక్తి అని విమర్శించారు. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పాలకులు ఏనాడు కూడా పేద ప్రజల సంక్షేమ కోసం ఆలోచన చేయలేదన్నారు.ఆరు గ్యారెంటీ స్కీమ్ లు వారంటీ లేని స్కీమ్ లని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబంలో ఇద్దరూ వ్యక్తులకు ఆసరా ఫించన్లు, రైతులకు ఉచితంగా రెండు బస్తాల యూరియా, రెండు బస్తాల డీఏపీలను అందజేస్తామన్నారు.సూర్యాపేట జిల్లాకు రైల్వేమార్గం బీజేపీతోనే సాధ్యమన్నారు. అనంతరం మునిసిపాలిటీ పరిధిలోని చర్చి కంపౌడ్ (46 వార్డు), కుడ కుడ వడ్డెర బజార్, కుడ కుడ ఎస్సీ కాలనీ, కుడ కుడ 14,2,15 వార్డులకు లకు చెందిన సూమారుగా 200 మంది బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు సంకినేని వెంకటేశ్వర్ రావు సమీక్షంలో బీజేపీలో చేరారు..