Thursday, March 20, 2025
HomeTelanganaబీఆర్ఎస్ ప్రభుత్వం తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి

బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి

మిర్యాలగూడ పీకే మీడియా నవంబరు 5
*సీఎం కెసిఆర్ గారి నేతృత్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి సాధ్యం అని మిర్యాలగూడ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు అన్నారు

సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అడవిదేవుల పల్లి మండలంలోని నడిగడ్డ, జాలకోటితండ, సారెగూడెం, నల్లమిట్ట తండా, బంగారికుంట తండ, చింతచెట్టుతండ, మొల్కచర్ల, బాలాజీతండ, బల్నేపల్లి, చిట్యాల, ముదిమాణిక్యం తదితర గ్రామాల్లో ప్రగతి యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని పలు వీధుల్లో, ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థించారు, వివిధ గ్రామాల్లోని మహిళా కోలాట బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో పెద్దఎత్తున స్వచ్ఛంధంగా ప్రజలు కదలివచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు మాట్లాడుతూ గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాలపై తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజల స్థితిగతులు తనకు తెలుసన్నారు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు.బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేదలందరికీ సంక్షేమ పథకాలు పొందుపరచడం జరిగిందని, మళ్ళి రానున్నది కెసిఆర్ గారి ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడానికి తనను ఆదరించి, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మరోసారి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments